Beautiful love letter from Actor Nani's Majnu wirtten by Ananth Sriram
- Abhinav
- Aug 27, 2017
- 1 min read

నిన్ను చూసిన రోజు, నేను రెండో సారి పుట్టిన రోజు, ఎందుకంటే ఆ రోజు నుంచి నాకు నేనే కొత్తగా ఉన్నాను. నువ్వు నా జీవితంలోకి రాక ముందు ఒక జీవితం, నువ్వొచ్చాక ఒక జీవితం. నువ్వు రాకముందు నా లైఫ్ లో చెప్పుకోవడానికి ఏమిలేదు, నువ్వు వచ్చాక ప్రతి రోజు, ప్రతి నిమిషం ఓ అద్భుతంలా అనిపిస్తుంది.
ఇది వరకు నేను గొప్పవాడిని అయిపోవాలని, ఎక్కడక్కడికో వెళ్లిపోవాలని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నీతో పాటు నీ చెయ్యిపట్టుకోని నడిస్తే చాలనిపిస్తుంది. ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయంటే నవ్వుకునేవాడిని కానీ, ఇప్పుడు నీకోసం ఎన్ని యుద్దాలైన చేయచ్చు అనిపిస్తుంది.
ఫ్యూచర్ లో నీకు ఎంత సంపాదించి పెడతానో చెప్పలేను కానీ, నిన్ను సంతోషపెట్టడానికి ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. నీ వెనకవుండి నిన్ను నడిపిస్తాను, నీ ముందు ఉండి నీ కష్టాన్ని అడ్డుకుంటాను. నిన్ను అమ్మలా చూసుకుంటాను.
నిన్ను గెలవాలి అంటే ఏన్ని జీవితాలు కావాలో తెలియదు, కానీ, నీకోసం ఎంత దూరమైన నడుస్తా, ఎన్నిసముద్రాలులైన ఈదుతా, ఎన్ని ఆకాశాలులైన దాటుతా, ఎందుకంటే నువ్వే నా జీవితం, నువ్వు లేని నన్ను ఊహించుకోలేను.
“ఈ కాగితం, నా జీవితం రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి…ఏం చేస్తావో నీ ఇష్టం
Comentarios